Transparency

ఈ మధ్య నేనొక ఆశ్రమానికి వెళ్ళొచ్చాను.  ఆ ఆశ్రమం గేటు రోడ్డు ప్రక్కగా  ఉంది.  ఆశ్రమం,  గేటునుంచి 200మీటర్లు కూడా ఉండదు. కాని,  రోడ్డు నుంచి గేటుకి,  గేటు నుంచి  ఆశ్రమానికి వచ్చేసరికి నా మనసు ఇంచుమించు లోకానికి ఒక పార్శ్వం దాటింది.  ఆ ఆశ్రమం మూగ చెవిటి పిల్లలకి సంబంధించినది.అంతకు ముందు ఆ పిల్లలు మాట్లాడలేరు, వినలేరు అనుకునేదాన్ని,కాని,అక్కడకి వెళ్ళాక నేను ఎంత పొరబడ్డానో అర్థమైంది.వారు మాట్లాడగలరు , వినగలరు కూడా, కాని అది పూర్తిగా స్వచ్చమైంది,కపటము లేనిది.అందుకే కాబోలు నాలాంటి ఎంతోమందికి ఆ భాష అర్థంకాదు.

ఆ క్షణాన నాకు అనిపించింది, స్వచ్చత లేని మనసుతో, కేవలం నోటితో మాట్లాడి, చెవులతో విన్నంతకాలం…. మనం మాట్లాడగలిగిన మూగవారం , వినిపించగలిగిన చెవిటివారం అని.      

 

DEPRESS

ఇవాళ ఉదయం పేపరు చదువుతుంటె అందులో “ఆత్మహత్యలు” గురించి రాసిఉంది. ఒక్కసారిగా ఏదోల అనిపించింది.నిజమే చావు మనిషిని అన్నిటినుండి దూరంచేస్తుంది, కాని దూరం చేయడానికి కాదుగ భగవంతుడు మనకు జీవితాన్ని ఇచ్చింది.

మనపనులు చేసుకోవడానికే మనకు తీరికలేనప్పుడు ,ఎందుకు మరొకరి పని నెత్తిన వేసుకోవడం? భగవంతుడు జీవితాన్ని ఇచ్చినప్పుడు దాన్ని తీసుకోవలసిన బాద్యత కూడా ఆయనదేగా? ఎందుకు మనం మన పని మానుకొని ఆయనకు సహాయం చేయడం, అంత ఖాళిగా భగవంతుడిని కూడా ఉంచకూడదు, ఆయన ఉద్యోగం ఆయనకి ఉండన్నివ్వాలిగా..! కనుక ఇకనుంచి ఎవరైన “DEPRESS” లో కనుక ఉంటే వెంటనే వారితో “సోది” మొదలెట్టండి. ఏమో ఎవరికి తెలుసు మీరూ ఒక ప్రాణం నిలబెట్టినవరౌతారేమో ….

సోది …..లో — సోది కాని సోది కి స్వాగతం

సాధరణంగా “తోచకపొవడమనేది” అందరికీ ఏదో ఒక సమయంలో జరిగేదే, అలాంటప్పుడు ఎవరితోనైన మాట్లాడలనిపించడం సహజం, కాని, ఊపిరి పీల్చుకోవడానికే సమయం చాలట్లెదు అనె ఈరోజుల్లొ కబుర్లు చెప్పే తీరిక ఎవర్కుంటుంది? ఒక వేళ ఉన్నా వినే ఓపిక మాత్రం ఎవరికీ ఉండట్లేదు. పోని అలా అని నాలాంటి మితభాషులు మాట్లడకుండ ఉండగలరా అంటె అదీలేదు.

అందువల్ల వినే వారు (చదేవేవారు) ఎవరో  ఒకరు ఉండకపోతార అనె చిన్ని ఆశతొ ఈ “సోది…..” మొదలుపెట్టడం జరిగింది అలాగీ నాకు వినే ఓపిక కూడా ఉంది కనుక “సోది …..” లో సోది చెవులు ,నోరు ఎల్లపుడు తెరిచేఉండును 

ఓపిగ్గా చదివినవారికి ధన్యవాదములు