Transparency

ఈ మధ్య నేనొక ఆశ్రమానికి వెళ్ళొచ్చాను.  ఆ ఆశ్రమం గేటు రోడ్డు ప్రక్కగా  ఉంది.  ఆశ్రమం,  గేటునుంచి 200మీటర్లు కూడా ఉండదు. కాని,  రోడ్డు నుంచి గేటుకి,  గేటు నుంచి  ఆశ్రమానికి వచ్చేసరికి నా మనసు ఇంచుమించు లోకానికి ఒక పార్శ్వం దాటింది.  ఆ ఆశ్రమం మూగ చెవిటి పిల్లలకి సంబంధించినది.అంతకు ముందు ఆ పిల్లలు మాట్లాడలేరు, వినలేరు అనుకునేదాన్ని,కాని,అక్కడకి వెళ్ళాక నేను ఎంత పొరబడ్డానో అర్థమైంది.వారు మాట్లాడగలరు , వినగలరు కూడా, కాని అది పూర్తిగా స్వచ్చమైంది,కపటము లేనిది.అందుకే కాబోలు నాలాంటి ఎంతోమందికి ఆ భాష అర్థంకాదు.

ఆ క్షణాన నాకు అనిపించింది, స్వచ్చత లేని మనసుతో, కేవలం నోటితో మాట్లాడి, చెవులతో విన్నంతకాలం…. మనం మాట్లాడగలిగిన మూగవారం , వినిపించగలిగిన చెవిటివారం అని.      

 

1 వ్యాఖ్య

  1. డిసెంబర్ 22, 2009 వద్ద 20:58

    నిజానికి వాళ్ళలోనే ఎక్కువ ఏకాగ్రత ఉంటుందట.
    సరే గానీ మీ బ్లాగ్ టైటిల్ మరింత మంచిది పెట్టడానికి ప్రయత్నిమ్చ రాదూ !! హిందువులను కిన్చపరిచినట్లుందేమో అని నా అభిప్రాయం


వ్యాఖ్యానించండి